Reading Time: < 1 minute

సూర్యాపేట జిల్లాలో పోలీస్ కస్టడీలో.. వ్యక్తి అనుమానాస్పద మృతి

Caption of Image.

సూర్యాపేట జిల్లాలో కలకలం. ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సైదాచారి అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండగా చనిపోవటం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొన్ని రోజుల క్రితం సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో పాపమ్మ అనే వృద్ధురాలి హత్య జరిగింది. పాపమ్మను చంపిన తర్వాత.. ఆమె శరీరంపై ఉన్న బంగారం ఆభరణాలతో పారిపోయారు నిందితులు. ఈ కేసులో విచారణలో భాగంగా.. సూర్యపేట పోలీసులు కొంత మందిపై అనుమానం వ్యక్తం చేశారు.

►ALSO READ | తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఎండలు తగ్గే ఛాన్స్ ఉందా..?

ఈ క్రమంలోనే హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సైదాచారి అనే వ్యక్తిని గుర్తించారు పోలీసులు. అతను ఏపీ రాష్ట్రం ఏలూరులో ఉన్న గుర్తించి.. అక్కడికి వెళ్లి సైదాచారిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు నుంచి సూర్యాపేటకు తీసుకు వస్తున్న క్రమంలో.. కోదాడ దగ్గర సైదాచారి చనిపోయాడు. అతని మృతదేహాన్ని కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 

కస్టడీలో ఉన్న సైదాచారి మరణానికి కారణాలు ఏంటీ అనేది సూర్యాపేట పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.