
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడనికి సిద్ధమవుతున్నారు. మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాక’లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన బన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. అయితే ఈ సినిమా ఎక్కువగా ముంబాయిలో షూటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోసం ముంబైకి మకాం మార్చాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ముంబైకి షిప్ట్ !
పదే పదే హైదరాబాద్ టు ముంబైకి ప్రయాణించడం వల్ల సమయం వృదా అవుతుంది. అంతే కాకుండా సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టడానికి బన్నీ ముంబైకి షిప్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. వాటిల్లో పోలీస్ ఆఫీసర్, సగం మానవ-సగం రాక్షస రూపం, తండ్రి పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
గర్భంతోనూ యాక్షన్ సీక్వెన్స్‌లో దీపికా!
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోనే నటిస్తుంది. ఇటీవలే ఆమె తన రెండో గర్భాన్ని ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె ‘దువా’కు జన్మనిచ్చిన దీపికా, ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమయంలోనూ ‘రాక’లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. గర్భవతిగా ఉండి కూడా రిస్క్ తీసుకుంటూ ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కల్కీ మూవీలో కూడా గర్బంతో ఉన్న సమయంలోనే నటించింది. ఇప్పుడు మరోసారి నటిస్తూ.. సినిమా పట్ల ఆమెకున్న నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అతిథిపాత్ర షారుఖ్?
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో భారీ తారాగణం ఉండబోతోంది , రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అట్లీతో ఉన్న అనుబంధంతో కింగ్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచనుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రాక’, 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్ సాధించిన బన్నీ, ‘రాక’తో గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ, స్టార్ తారాగణం కలిసిన ఈ ‘రాక’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి..
The wait is over.
Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026