Reading Time: < 1 minute

Chiranjeevi: కష్టాల్లో ఉన్నవారికి ‘మెగా’ భరోసా.. మేకప్ ఆర్టిస్ట్, మాజీ మేనేజర్ కుటుంబాలకు చిరు ఆర్థిక సాయం.

Caption of Image.

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ తన ఉదారతలో ‘అందిరివాడు’ అనిపించుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ.. ముందుండి భరోసా ఇస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వరుస సేవా కార్యక్రమాలు మెగాస్టార్ లోని మానవవత్వాన్ని మరోసారి చాటిచెబుతున్నాయి. లేటెస్ట్ గా తనను నమ్ముకున్న వారికి పెద్దన్నగా నిలిచారు.

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ కార్మికులకు, సన్నిహితులకు మెగాస్టార్ చిరంజీవి  అండగా నిలుస్తున్నారు.  తన వద్ద పనిచేసే మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ గుండె శస్త్రచికిత్స కోసం రూ. 10.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శివనాథ్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే తన మాజీ మేనేజర్ కేవీ నరసయ్య కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి ఆయన భార్య బైపాస్ సర్జరీ కోసం తక్షణం రూ. 9.5 లక్షలు అందజేశారు. తన పాత మిత్రుల పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు.

వ్యక్తులకే కాకుండా, వ్యవస్థల బలోపేతానికి కూడా చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ. 5 లక్షలు, ఇతర చారిటబుల్ ట్రస్టులకు రూ. 10 లక్షల విరాళం అందిస్తూ తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఒకప్పుడు రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న కాలంలో ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ స్థాపించి లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచిన ఆయన, నేడు సినీ కార్మికులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

రియల్ హీరో చిరంజీవి సినిమా అంటే కేవలం గ్లామర్, కలెక్షన్లు మాత్రమే కాదు.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే అసలైన విజయం అని చిరు నిరూపిస్తున్నారు. అందుకే ఆయన అభిమానులకు కేవలం ‘మెగాస్టార్’ మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ‘మెగా పవర్‌హౌస్’. అని ప్రశంసిస్తున్నారు. చిరు నటించిన’ విశ్వంభర’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

©️ VIL Media Pvt Ltd.