
తమిళ స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ మరోసారి అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ వేదికపై తన ప్రతిభను చాటుకున్నారు. తన స్వంత జట్టు “అజిత్ కుమార్ రేసింగ్” తో కలిసి ఆయన ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని ఇండియా సత్తా చాటారు.
లేటెస్ట్గా బెల్జియంలోని ఫెమస్ ట్రాక్ Circuit de Spa-Francorchamps లో జరిగిన ప్రతిష్టాత్మక 24H Series ఎండ్యూరెన్స్ రేసులో అజిత్ కుమార్ జట్టు అద్భుత ప్రదర్శనతో రెండవ స్థానం (P2) సాధించింది. ఈ విజయం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.
పోటీ అనంతరం పోడియంపైకి చేరిన అజిత్ కుమార్, భారత జెండాను ఎగురవేస్తూ తన జట్టుతో కలిసి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు, సినీ ఫ్యాన్స్ “సూపర్బ్ తలా” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
At the proud podium 🇮🇳🏁🏆🏎️
Ajith Kumar and his team bring glory to India at Circuit de Spa-Francorchamps 🔥P2 finish at the 24H Series — where passion meets pride, and the Indian flag flies high on the global stage. 🇮🇳✨ @Akracingoffl @DoneChannel1 #AjithKumar #IndianRacing… pic.twitter.com/BcZ3cl1U27
— Suresh Chandra (@SureshChandraa) April 19, 2026
ఇదిలా ఉండగా, అజిత్ కుమార్ 2026 సంవత్సరంలో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, యుకే, పోర్చుగల్ దేశాల్లో జరిగే పలు అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. సినిమాలకే పరిమితం కాకుండా రేసింగ్ రంగంలో కూడా అజిత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Racing to glory, carrying a billion dreams 🇮🇳🏁🏆🏎️
P2 finish for Ajith Kumar’s racing team at the legendary Circuit de Spa-Francorchamps in the 24H Series – GT3 Pro-Am 🔥
A moment that made the entire Indian nation proud — proving passion, grit, and determination know no limits.… pic.twitter.com/UFcl4XY6Dz— Ajithkumar Racing (@Akracingoffl) April 19, 2026