Reading Time: < 1 minute

Summer Alert : చీప్ వైరింగ్, ఇంజిన్ ఓవర్ హీటింగ్ వల్లనే.. కార్లలో మంటలు వస్తున్నాయా..!

Caption of Image.

ఎండాకాలం వచ్చిందంటే మనం అక్కడక్కడా అకస్మాత్తుగా కార్లలో మంటలు వచ్చి కాలిపోయాయన్న వార్తలు చదువుతూ ఉంటాం. ఈ నెలలో ఎండలు మండడం మొదలైందో లేదో అప్పుడే నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 42 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆ వేడికి ప్రయాణంలో ఉండగానే కార్లలోంచి పొగలు వచ్చి..నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమైపోతున్నాయి. కేవలం అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నా…ఇతర కారణాలు వీటికి దోహదం చేస్తున్నాయని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు.

చీప్​క్వాలిటీ వైరింగ్..

కార్లలో చీప్​క్వాలిటీ వైరింగ్​చేయించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లలో ఉండే బ్యాటరీలు, ఆల్టర్నేటర్, వైర్లపై ఎండల ప్రభావం ఉంటుంది. పాత వైర్లు లేదా చీప్ క్వాలిటీ వైరింగ్ ఉంటే ఇన్సులేషన్ కరుగుతుంది. అప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగి స్పార్క్‌‌‌‌ అయ్యేలా చేస్తుంది. అందుకే ఎక్కువగా పాత కార్లలో లేదా సరిగా సర్వీసింగ్ చేయించని వాహనాల్లోనే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. 

ఇంజిన్ ఓవర్ హీటింగ్ .. 

కారు ఇంజిన్ అవసరమైన టెంపరేచర్ కంటే ఎక్కువ వేడెక్కితే దాన్ని ఇంజిన్ ఓవర్‌‌‌‌ హీటింగ్ అంటారు. హై టెంపరేచర్ వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల ఒక్కసారిగా కారు ఆగిపోతుంది. ఎండాకాలంలో కూలెంట్ స్థాయి తగ్గిపోవడం, రేడియేటర్ కూడా సరిగ్గా పని చేయకపోతే ఇంజిన్ లో టెంపరేచర్ ఎక్కువగా పెరుగుతుంది. దీంతో గాస్కెట్ డ్యామేజ్ అయి కూలెంట్, ఆయిల్ కలిసిపోవడంతో పొగ వచ్చి మంటలు రావడానికి కారణమవుతుంది. అలాగే, ఇంజిన్‌‌‌‌లో నుంచి పొగను బయటకు పంపేది ఎగ్జాస్ట్ సిస్టమ్. ఎండలకు ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ వేడి అయినా, వాహనంలో ఉన్న ప్లాస్టిక్ భాగాలు కాలిపోయి మంటలంటుకోవడానికి కారణమవుతాయి.  

©️ VIL Media Pvt Ltd.