
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వేటు పడే అవకాశంఉందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి బీసీసీఐ అధికారిక వర్గాలు. సారథిగా టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన సూర్య.. బ్యాటర్ గా మాత్రం పేలవ ప్రదర్శనతో రోజు రోజుకు దిగజారిపోయాడు. దాదాపు ఏడాది పాటు టీ20ల్లో నంబర్–1 బ్యాటర్ కొనసాగిన స్కై.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా బాగా కష్టపడుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటర్ గా ఘోరంగా విఫలమయ్యాడు.
గతేడాది దాదాపు 25కు పైగా టీ20లు ఆడిన సూర్యకుమార్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్ పై పడుతున్నట్లు క్రికెట్ పండితులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్ లని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ జట్టును రెడీ చేయాలని యోచిస్తున్నట్లు టాక్. దీంతో సూర్య స్థానంలో మరో ముంబై ప్లేయర్ శ్రేయస్ అయ్యరుకి జట్టు పగ్గాలు అప్పగించేందుకు ఇండియన్ క్రికెట్ బోర్డు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్త కథనాలు వస్తున్నాయి. టీ20ల్లో నంబర్– 4 స్థానానికి అయ్యర్ సరైన ప్రత్యామ్నాయమని బీసీసీఐ భావిస్తుంది.
శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహించనప్పటికీ.. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్లో కెప్టెన్ గా అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. శ్రేయస్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్-2024 సీజన్ లో కేకేఆర్ కి ట్రోఫీ అందించాడు. గత సీజన్లో పంజాబ్ జట్టుని సైతం ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోని కింగ్స్ టీమ్ అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. ఇక శ్రేయస్ డొమాస్టిక్ క్రికెట్ లో కూడా ముంబై జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. దీంతో అతడికి జాతీయ జట్టును నడిపించే సత్తా కూడా ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా టీ20 జట్టు పగ్గాలు శ్రేయస్ అయ్యర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.