
చనిపోయిన కుటుంబికుడి పై ఉన్న ప్రేమతో ఒక కుటుంబం చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో ఒక సంపన్న కుటుంబం, మరణించిన బంధువుతో పాటు ఒక లగ్జరీ కారును కూడా సమాధి చేసారు.
సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన వస్తువులను పక్కన పెడతారు. కానీ ఈ ‘జిన్’ అనే కుటుంబం ఏకంగా 1.49 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ S450L కారునే సమాధిలో పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పెద్ద ఎక్స్‌కవేటర్ సాయంతో కారును గుంతలోకి దించి, దానిపై మట్టి కప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
కారు ‘నెంబర్ ప్లేట్’ వెనుక రహస్యం
ఆ కారుకు ‘8888’ అనే నెంబర్ ప్లేట్ ఉంది. చైనా సంస్కృతిలో ‘8’ అనే అంకెను అదృష్టానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చనిపోయిన వ్యక్తికి మరణం తర్వాత కూడా రాజభోగాలు, హోదా దక్కాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు ఆ కుటుంబం చెబుతోంది.
ఈ ఘటనపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పనిచేసే కారును అలా మట్టిలో కలపడం వృథా అని చాలా మంది మండిపడుతున్నారు. కారులోని బ్యాటరీలు, ఆయిల్ వల్ల భూమి కలుషితం అవుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | మా అణు హక్కులపై వెనక్కి తగ్గేదే లేదు.. గౌరవప్రదంగా యుద్ధం ముగించాలి: ఇరాన్ అధ్యక్షుడు
స్థానిక ప్రభుత్వం దీనిని మూఢనమ్మకంగా కొట్టిపారేసింది. ఇలాంటి పనుల వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని మందలించింది.
చివరికి జనం నుంచి వ్యతిరేకత రావడంతో ఆ కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అయితే అధికారులు మాత్రం ఊరుకోలేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ మొదలుపెట్టారు. ఆ కారును తిరిగి బయటకు తీయాలని ఆదేశించే అవకాశం ఉంది. పర్యావరణానికి జరిగిన నష్టానికి గానూ ఆ కుటుంబానికి భారీ జరిమానా విధించే ఛాన్స్ ఉంది.
A viral video from China’s Liaoning shows a black Mercedes-Benz S450L with a “8888” license plate being lowered into a pit by an excavator and buried next to a tombstone. Local civil affairs authorities in Liaoyang say they are investigating the incident. pic.twitter.com/4LUJwGOf7L
— Shanghai Daily (@shanghaidaily) April 10, 2026