Reading Time: 2 minutes

RR vs KKR: వైభవ్, జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్‌.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే!

Caption of Image.

RR vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)తో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక దశలో భారీ స్కోరు దిశగా సాగిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను కేకేఆర్ స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ అడ్డుకున్నారు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. కేకేఆర్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

మలుపు తిప్పిన వరుణ్ చక్రవర్తి: 
రాజస్థాన్ జోరును వరుణ్ చక్రవర్తి అడ్డుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ కొట్టిన బంతిని రమణదీప్ సింగ్ క్యాచ్ పట్టడంతో అవుట్ కావడంతో కేకేఆర్ కి తొలి బ్రేక్ త్రూ లభించింది. ఆ తర్వాత రాజస్థాన్ స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస వికెట్లతో కేకేఆర్ బౌలర్లు పట్టు బిగించారు. ధృవ్ జురెల్ (5) వరుణ్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ కాగా.. యశస్వి జైస్వాల్ (39) సునీల్ నరైన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (12) సైతం వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయలో పడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

డెత్ ఓవర్లలో కార్తిక్ త్యాగి మ్యాజిక్: 
చివరి ఓవర్లలో రాజస్థాన్ కోలుకోకుండా కార్తిక్ త్యాగి దెబ్బకొట్టాడు. 144 నుంచి 146 పరుగుల వ్యవధిలోనే రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (9), షిమ్రాన్ హెట్‌మయర్ (15), రవి బిష్ణోయ్ (0) లని త్యాగి అవుట్ చేయడంతో రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ పిచ్‌పై విజయం నల్లేరుపై నడకే అనిపిస్తోంది. కానీ, రాజస్థాన్ బౌలర్లు తమ స్పిన్ మాయాజాలంతో ఈ చిన్న లక్ష్యాన్ని కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. 

 

 

©️ VIL Media Pvt Ltd.