Reading Time: 2 minutes

OTT Review: ఓటీటీలో ఈ క్రైమ్ సిరీస్ మిస్ అవ్వొద్దు.. థ్రిల్ ఇచ్చే ముంబై గ్యాంబ్లింగ్ కథ

Caption of Image.

ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లతో బిజీగా ఉన్నాడు విజయ్ వర్మ. ప్రస్తుతం తను హీరోగా ‘మట్కా కింగ్’ అనే వెబ్ సిరీస్‌‌‌‌ రిలీజై దుమ్మురేపుతోంది. ‘సైరత్‌‌‌‌’ ఫేమ్‌‌‌‌ నాగరాజ్ మంజులే  దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ 1960 నాటి ముంబై నేపథ్యంలో రూపొందింది. ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో హిందీతోపాటు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది. 

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ఇంటర్నెట్ లేని రోజుల్లోనే దేశవ్యాప్తంగా బెట్టింగ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఖత్రి. అతని జీవితం ఆధారంగానే ఈ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి రతన్ ఖత్రీ, కళ్యాణ్ జీ భగత్ వంటి మట్కా కింగ్‌ల జీవితాల నుంచి ప్రేరణ పొందినా, ఇందులో విజయ్ వర్మ పోషించిన ‘బ్రిజ్ భట్టీ’ అనే కల్పిత పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.

1960ల బాంబేలో మట్కా (జూదం) వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి, శక్తివంతమైన కింగ్-మేకర్‌గా ఎదుగుతాడు బ్రిజ్ భట్టీ. ఇందులో ఈ పాత్ర కోసం విజయ్ వర్మ రిట్రో స్టైల్ మరియు భారీ స్వాగ్‌తో నటించారు. సాధారణ వ్యక్తి నుండి మట్కా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా, లాల్‌జీ భాయ్ (గుల్షన్ గ్రోవర్) నీడ నుండి బయటపడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే వ్యక్తిగ నటించి అదరగొట్టాడు. ‘మట్కా కింగ్‌‌‌‌’లో విజయ్ వర్మతో పాటు కృతికా కమ్రా, సాయి తమహంకర్, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

కథేంటంటే:

బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) తన భార్య బర్ఖా (సాయి తమ్హంకర్), తమ్ముడు లచ్చు (భూపేంద్ర జాదావత్)తో కలిసి ముంబైలో ఉంటాడు. కాటన్ ట్రేడర్​గా పనిచేస్తూ, తన యజమాని లాల్జీభాయ్ (గుల్షన్ గ్రోవర్)కు కార్డ్ బేస్డ్‌‌ బెట్టింగ్ గేమ్ సట్టా నడపడంలో సాయం చేస్తాడు. ఆ గేమ్‌‌ ఆడేవాళ్లు 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలపై పందెం వేస్తారు. అయితే.. లాల్జీభాయ్ పందెం కాసేవాళ్లతో నిజాయితీగా వ్యవహరించకుండా, లాభాలను పెంచుకోవడానికి గేమ్‌‌ రిజల్ట్స్‌‌ని తారుమారు చేస్తుంటాడు. అదే టైంలో బ్రిజ్‌‌ తమ్ముడు తన జూదం అలవాట్ల వల్ల అప్పు చేసి ఒక ఫైనాన్షియర్‌‌ చేతిలో ఇరుక్కుంటాడు. అతన్ని కాపాడటానికి బ్రిజ్ పది రోజుల్లో అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని మాట ఇస్తాడు. తర్వాత డబ్బు కోసం సొంతంగా ఒక కొత్త గ్యాంబ్లింగ్ గేమ్ ‘మట్కా’ మొదలుపెడతాడు. ధనికులు, ఎలైట్ వర్గాలకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్‌‌ను సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాడు. దాంతో ముంబైలోని అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సిరీస్‌‌ చూడాలి. 

ఎలా ఉందంటే: 

విజయ్ వర్మ ఈ సిరీస్‌కు ప్రధాన బలం. రిట్రో లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిసి ఆయన పాత్రను బలంగా నిలబెట్టాయి. సాయి తమ్హంకర్, కృతికా కామ్రా తమ పాత్రలకు న్యాయం చేశారు. గుల్షన్ గ్రోవర్ నెగటివ్ షేడ్‌లో మళ్లీ ఆకట్టుకున్నారు. దర్శకుడు నాగరాజ్ మంజులే 1960ల కాలాన్ని నమ్మదగిన విధంగా రీక్రియేట్ చేశారు. సెట్స్, కాస్ట్యూమ్స్, బ్యాక్‌డ్రాప్ ఇస్తాయి. స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, మొత్తం మీద ఎంగేజింగ్‌గా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా, రియల్-లైఫ్ ప్రేరణ ఉన్న స్టోరీస్ ఇష్టపడేవారికి ఇది మంచి వాచ్. ముఖ్యంగా విజయ్ వర్మ నటన, బాడీలో ఆ స్వాగ్  కోసం తప్పక చూడొచ్చు.
 

©️ VIL Media Pvt Ltd.