Reading Time: < 1 minute

హైదరాబాద్ లో పలు చోట్ల వడగండ్ల వాన..నేలకొరిగిన చెట్లు, స్తంభాలు!

Caption of Image.

 హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. మార్నింగ్ నుంచి ఎండలు దంచికొట్టగా ఇపుడు  పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా  పలు చోట్ల వడగండ్ల వాన పడుతోంది.  

కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ పరిసరాల్లో  వడగళ్ల వాన పడుతోంది. భయంకరమైన వర్షం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.  కుత్బుల్లాపూర్,జీడిమెట్ల,సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బహుదూర్ పల్లి, సూరారం, చింతల్,షాపూర్ నగర్, గాజులరామారం, సికింద్రాబాద్,కంటోన్మెంట్ లో   వర్షం పడుతోంది. 

ఎల్లమ్మ బండ, హైదర్ నగర్, వివేకానంద నగర్, నిజాంపేట, ప్రగతి నగర్ కెపిహెచ్ బి కాలనీ, మూసాపేట, బాలానగర్, ఫతేనగర్, కూకట్ పల్లి పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. .చింతల్, పద్మనగర్ లో గాలి వాన ధాటికి వేర్ల తో సహా భారీ వృక్షం కూలింది.  చెట్టు ధాటికి రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి .పలు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. 

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మరో వైపు హైదరాబాద్ సిటీలో రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం పడుతుందని  తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్,కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో  రెండు మూడు గంటల్లో తేలిక పాటు వర్షం పడనుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి ,రంగారెడ్డి, సంగారెడ్డి, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ

©️ VIL Media Pvt Ltd.