Reading Time: < 1 minute

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! BPCLలో 250 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL ) జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి మే 17 వరకు కొనసాగుతుంది. 

మొత్తం ఖాళీలు: 250.

విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్) 175, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్) 25, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (వేసైడ్ ఎమినిటీస్) 10, సెక్రటరీ బీపీసీఎల్ 08, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెటేషన్) 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బి.కాం/ బీబీఏ/ బీఎస్సీ/ బీఎంఎస్/ బీహెచ్ఎం, ఎంఎస్సీ, హిందీలో మాస్టర్స్ డిగ్రీ, సీఏ ఇంటర్/ సీఎంఏ ఇంటర్​తోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 18.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

లాస్ట్ డేట్: మే 17.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష/  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్డ్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.bharatpetroleum.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.