Reading Time: < 1 minute

హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

సిద్ధిపేటలో భావన నిర్మాణ కార్మికులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం ( ఏప్రిల్ 19 ) సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి మా నాన్న కాక వెంకటస్వామి కృషి చేశారని..పీవీ నరసింహారావుతో కొట్లాడి సింగరేణి భూముల రక్షణ,కార్మికుల పెన్షన్లకు కృషి చేశారని అన్నారు. కాకా వెంకటస్వామి మార్గంలోనే కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలనేది తన తపన అని.. హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.

కార్మికులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూ.10 లక్షలకు పెంచామని…గిగ్ వర్కర్స్ భద్రత కోసం గిగ్ వర్కర్స్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టామని అన్నారు. సిద్దిపేట పట్టణంలో జిల్లా భవన నిర్మాణ కార్మిక భవనానికి స్థల కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి మాట ఇస్తున్నానని అన్నారు.కేవలం ఓట్ల కోసం మాజీ మంత్రి హరీశ్ రావు హామీలు ఇచ్చాడని అన్నారు.

రాబోయే రోజుల్లో ప్రతీ జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు మంత్రి వివేక్. జర్మనీ పర్యటనలో భాగంగా కార్మికులకు విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు రూ.90కోట్లు మంజూరు చేశామని అన్నారు.టామ్ కాం కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని..భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ల విషయంపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,పెన్షన్లు,యాక్సిడెంట్ ఇన్సూరెన్సులు అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తానని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 

©️ VIL Media Pvt Ltd.