
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్ మార్కెట్లో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. ఈ ఘటనను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్ క్లిమెంకో ధృవీకరించారు.
శనివారం (ఏప్రిల్ 18) ఇజ్రాయెల్ రాజధాని కీవ్‌లో ఒక దుండగుడు కాల్పులు జరపడంతో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. ఓ సూపర్ మార్కెట్‌లోకి చొరబడ్డ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపి బందీలను పట్టుకున్నాడని చెప్పారు. అనంతరం పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో దుండగుడు హతమయ్యాడని వెల్లడించారు.
నలుగురు బందీలను పోలీసులు రక్షించారని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సూపర్ మార్కెట్ సమీపంలోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ జాతీయ పోలీసు, భద్రతా సేవల అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.