
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్, వాసుదేవ్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది బ్రేకింగ్ న్యూస్’ (The Breaking News) . పవన్ కడియాల దర్శకత్వం వహించిన ఈ మూవీపై గట్టిగానే అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ టీమ్ కు మెగస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించారు. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకువచ్చింది.
మెగాస్టార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్
లేటెస్ట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో విడుదల చేశారు. పోస్టర్ చూసిన చిరంజీవి చిత్ర యూనిట్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. ముఖ్యంగా మురళీ మోహన్ ఆహార్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మురళీ మోహన్ ని ఇంత అగ్రెసివ్ లుక్‌లో, కోపంతో ఊగిపోతున్న పాత్రలో నేనెప్పుడూ చూడలేదు. ఈ ఫస్ట్ లుక్ చూశాక సినిమా చూడాలనే కుతూహలం నాలో పెరిగింది అని చిరంజీవి అన్నారు. అనన్య నాగళ్ల ప్రతిభను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
మీడియా మాఫియాపై సమరం?
దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా మలిచారు. నేటి సమాజంలో సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, బ్రేకింగ్ న్యూస్ వెనుక దాగి ఉండే చీకటి కోణాలు ఏమిటనే అంశాలను ఇందులో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వాసుదేవ్ మరో కీలక పాత్రలో కనిపిస్తుండగా, ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ అత్యంత నాణ్యతతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మే 2026న గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా 2026 మే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మురళీ మోహన్ వంటి సీనియర్ నటుడు ఈ వయసులోనూ ఇంతటి పవర్‌ఫుల్ పాత్రను పోషించడం ఆశ్చర్యంగా ఉందని చిరు కొనియాడారు. అనన్య నాగళ్లకి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కి చిరంజీవి సపోర్ట్ తో మరింత క్రేజ్ లభించింది.
‘ది బ్రేకింగ్ న్యూస్’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు అన్నయ్య చిరంజీవి గారు pic.twitter.com/otsUT74mE4
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) April 18, 2026