Reading Time: < 1 minute

ఆదివారం అక్షయ తృతీయ: ఎవర్ని పూజించాలి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఏం కొనాలి..!

Caption of Image.

అక్షయ తృతీయకు హిందువులు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ష పక్షం రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున త్రేతాయుగం ప్రారంభమైందని.. శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. అయితే.. హిందువులు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ అక్షత తృతీయ రోజు కచ్చితంగా చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 

అక్షయ తృతీయ రోజు చేయాల్సిన పనులు:

  • వ్యాపారాలు, పెట్టుబడులు లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  • సంపద, విజయం ప్రసాదించేలా ఆశీర్వాదించాలని విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించండి.
  • బంగారం లేదా విలువైన వస్తువులు కొనండి
  • అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి లేదా ఆస్తిని కొనుగోలు చేయడం శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
  • ఈ పర్వదినాన పేదలకు ఆహారం, బట్టలు లేదా నీటిని దానం చేయడం వల్ల పుణ్యఫలాలు రెట్టింపు అవుతాయి.
  • వ్యాపారాలు ప్రారంభించడానికి, గృహ ప్రవేశానికి లేదా వివాహ నిశ్చయాలకు ఈ రోజు అత్యంత శుభప్రదమైనది. 

అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు:

  • అక్షయ తృతీయ రోజున అప్పులు తీసుకోవడం, ఇనుముతో చేసిన పదునైన వస్తువులు కొనడం వంటివి మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
  • ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం అశుభంగా భావిస్తారు.
  • అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మానేయండి
  • ఇంట్లో వాగ్వాదాలు పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి శాంతంగా, సంతోషంగా ఉన్న చోట మాత్రమే ఉంటుంది.
  • ప్లాస్టిక్, అల్యూమినియంపై రాహువు ప్రభావం ఉంటుందని, వీటిని కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతారు.
  • అక్షయ తృతీయ నాడు జుట్టు కత్తిరించుకోవడం లేదా గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు.
  • సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చడం అశుభం, ఇది లక్ష్మీదేవిని బయటకు పంపినట్లు భావిస్తారు.
©️ VIL Media Pvt Ltd.