Reading Time: 2 minutes

రికార్డు ధరకు రజనీకాంత్ ‘జైలర్ 2’ ఓటీటీ డీల్.. ఎన్ని వందల కోట్లంటే?

Caption of Image.

భారతీయ సినీ చరిత్రలో రికార్డులు తిరగరాయడంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు కొత్తేమీ కాదు.  కానీ ఈ సారా ఆయన కేవలం రికార్డులు తాకడం కాదు.. ఏకంగా కొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం కోలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటి 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి.

రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్!

ఈ ‘జైలర్ 2’  సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే వ్యాపారపరంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసిందని సమాచారం. సుమారు 160 కోట్ల రూపాయల భారీ ధరతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ చరిత్రలో ఏ సినిమాకు దక్కని స్థాయిలో ఈ స్థాయి డీల్ సెట్ అవ్వడం రజనీ క్రేజ్‌కు అద్దం పడుతోందంటున్నారు. మొదటి పార్ట్ ‘జైలర్’ డిజిటల్ హక్కులు 75 కోట్లు పలికగా, సీక్వెల్‌కు దానికి రెట్టింపు ధర లభించడం మరింత ఆసక్తిని పెంచుతుంది..

రెట్టింపు అంచనాలతో రెడీ…

‘జైలర్’ మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ ల అతిథి పాత్రలు ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించాయో అందరికీ తెలిసిందే. సీక్వెల్‌లో ఈ జోరును మరింత పెంచుతున్నారు నెల్సన్.  ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ దిగ్గజం మోహన్ లాల్ మళ్ళీ కనిపించబోతున్నారు. వీరితో పాటు నటుడు ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరో వైపు ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్‌తో థియేటర్లను దడదడలాడించడానికి రెడీ అయిపోయారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ముంబై, గోవా, కేరళ వంటి ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాను 2026 ఆగస్టు 12 లేదా 14న, స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల చేసేందుకు సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి ‘జైలర్ 2’తో రజనీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.