
గూగుల్ పిక్సెల్ 10a మార్కెట్లోకి అడుగుపెట్టింది. 500 డాలర్ల ధరలో బెస్ట్ అనుకున్నా.. ఇందులో పాత టెన్సర్ G4 చిప్‌నే వాడటం కొంచెం నిరాశ కలిగించే విషయమే. అందుకే అదే బడ్జెట్‌లో అంతకంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చే 5 బెస్ట్ ఆండ్రాయిడ్ ఆల్టర్నేటివ్స్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. Realme GT 7T:
రియల్ మీ GT 7T ఫోన్ భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ను కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్. దీని ధర సుమారు 459 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.41వేలు. ఇందులో 7,000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 42 నిమిషాల్లోనే పూర్తి ఛార్జ్ అవుతుంది. పిక్సెల్ 10a తో పోలిస్తే ఇందులో 256GB బేస్ స్టోరేజ్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.
2. Poco F7 Pro:
తక్కువ ధరలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ పోకో F7 ప్రో. దీని ధర భారత కరెన్సీలో సుమారు రూ.52వేలుగా ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ఉండటం వల్ల పిక్సెల్ 10a కంటే వేగంగా పనిచేస్తుంది. 2K రిజల్యూషన్ కలిగిన OLED డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రీమియం ఫీచర్లు దీని సొంతం. గేమింగ్ లవర్స్ కి ఇది మంచి ఛాయిస్ అని చెప్పుకోవాలి.
3. Honor 400 Pro:
కెమెరా క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేవారు హానర్ 400 ప్రో వైపు చూడవచ్చు. దీని ధర దాదాపు రూ.58వేలుగా ఉంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని 200MP మెయిన్ కెమెరా. అలాగే సెల్ఫీల కోసం 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 100W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో ఇది అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది.
ALSO READ : ఒక్క గంటలోనే 7 సార్లు అబద్దాలు చెప్పిన ట్రంప్..
4. Samsung Galaxy S25 FE:
శాంసంగ్ నమ్మకం.. ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కావాలనుకునే వారికి గెలాక్సీ S25 FE సరైనది. దీని ధర దాదాపు రూ.59వేలు. ఇందులో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది. గూగుల్ మాదిరిగానే శాంసంగ్ కూడా దీనికి 7 ఏళ్ల పాటు అప్‌డేట్స్ ఇస్తుంది. గెలాక్సీ AI ఫీచర్లు, శాంసంగ్ డెక్స్ సదుపాయంతో పాటుగా ఐకానిక్ డిజైన్ దీని ప్రత్యేకతలు.
5. OnePlus 15R:
అత్యంత శక్తివంతమైన ఫోన్ వన్‌ప్లస్ 15R. దీని ధర సుమారు రూ.63వేలుగా ఉంది. ఇందులో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉండటం వల్ల దీని వేగం అసాధారణంగా ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, 7,400 mAh భారీ బ్యాటరీ కోసం 80W ఛార్జింగ్ సపోర్ట్ దీనికి ఉన్నాయి. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది పిక్సెల్ 10a కంటే బెటర్ ఆల్టర్నేటివ్ అంటున్నారు టెక్ నిపుణులు.