Reading Time: < 1 minute

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Caption of Image.

టీజీఈ జేఏసీ కమిటీ పిలుపుతో ఆందోళనలు

నెట్​వర్క్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 51శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని వెంటనే ప్రకటించాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్​జిల్లాలో ఉద్యోగులు నిరసనలు తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అంగన్వాడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన చేశారు.

ఈహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఆరోగ్య కార్డులను మే 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని, సీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసి, ఓపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు మెమోరండం అందజేశారు.

©️ VIL Media Pvt Ltd.