Reading Time: < 1 minute

రోడ్డుపై యమధర్మరాజు

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరవచ్చని మంచిర్యాల డీసీపీ ఎం.భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి టోల్​ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ‘అరైవ్​అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రోడ్డు భద్రత, గోల్డెన్​అవర్, సీపీఆర్​పై అవగాహన కల్పించారు. డీసీపీ మాట్లాడుతూ.. వ్యక్తిగత నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

డ్రైవర్లు, ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో కళాకారులు టోల్​ప్లాజా వద్ద డ్రైవర్లు, స్థానికులకు అవగాహన కల్పించిన తీరు ఆలోచింపజేసింది. మందమర్రి సీఐ రమేశ్​పలు స్టేషన్ల ఎస్సైలు, ఆటోయూనియన్​ లీడర్లు  తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.