Reading Time: < 1 minute

సదుపాయాలు కల్పించే వరకు.. హుండీలో డబ్బులు వెయ్యం

Caption of Image.
  • లెటర్లు రాసి హుండీలో వేసిన అజ్ఞాత భక్తులు 

కొండగట్టు, వెలుగు: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన కొండగట్టు అంజన్న ఆలయంలో సౌకర్యాల కొరతపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయబోమని లేఖలు రాసి హుండీలో వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న జరిగిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని 17 రోజుల వ్యవధిలో సేకరించిన 14 హుండీలను ఆలయ ఈవో అంజనా రెడ్డి ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. మొత్తం రూ.75,02,126 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

లెక్కింపు సమయంలో హుండీలో వేసిన కొన్ని లేఖలు సిబ్బంది చేతికి వచ్చాయి. కొండగట్టులో భక్తులకు తీవ్ర అసౌకర్యాలు ఉన్నాయని, కోనేరులో నీరు అపరిశుభ్రంగా ఉండటం, టాయిలెట్స్​ వద్ద శుభ్రత పాటించకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని భక్తులు లేఖల్లో పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే హుండీలో కానుకలు సమర్పించబోమని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.