
ఖమ్మం టౌన్/ దమ్మపేట/ జనగామ అర్బన్/ రఘునాథపల్లి (లింగాలఘనపురం)/ ములుగు/ టేకులపల్లి/ కల్లూరు, వెలుగు : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్లో అందించే ప్రాణాలను కాపాడవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆఫీసర్లు, లీడర్లు సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద సమయంలో అందించాల్సిన వైద్యంపై గోల్డెన్ అవర్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి, మేయర్ పునుకొల్లు నీరజ, ఏడీసీపీ ప్రసాదరావు పాల్గొని అవగాహన కల్పించారు.
అంతకుముందు వారు ఆర్టీవో ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్ పాల్గొన్నారు. జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, డీసీపీ రాజమహేంద్రనాయక్రోడ్డు ప్రమాదాల నివారణపై మాట్లాడారు. అనంతరం డీసీపీ లింగాల ఘనపురం పీఎస్ పరిధిలోని నెల్లుట్ల హైవేపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని బాధితులను ఎలా రక్షించాలనే అంశాలపై వివరించారు. ములుగు పీఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
ప్రమాదం జరిగిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడితే రహ్వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం అందించనున్నట్లు పేర్కొన్నారు. టేకులపల్లి మండలంలోని లారీ యూనియన్ ఆఫీస్ లో ఇల్లందు డీఎస్పీ వెంకన్న గోల్డెన్ అవర్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఎస్సై హరిత ఆధ్వర్యంలో కల్లూరు పీఎస్ పరిధిలోని లింగాలలో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా ప్రోగ్రామ్‌లలో రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను, వాహనదారులకు అందజేశారు.