Reading Time: < 1 minute

ఉపాధి కూలీల‌ ‌ముఖానికి పౌడర్.. ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన పనిది.. ఏమన్నా ఐడియానా !

Caption of Image.

కుమురం భీమ్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ముఖ చిత్రం గుర్తింపు తప్పనిసరి చేసింది. కానీ ముఖం గుర్తింపు రాక కూలీలు ఇంటికి తిరిగి వెళ్లుతున్నారు. అయితే కుమురం భీమ్ జిల్లాలో ముఖం గుర్తింపు పడకుండా ఇబ్బందులు తొలగించడానికి జైనూర్ మండలం జామిని గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాబు వినూత్నంగా ఆలోచించాడు.

ముఖ చిత్రాలు పడని వారి ముఖాలకు టాల్కమ్ పౌడర్ వేస్తున్నారు. ముఖానికి పౌడర్ కొట్టడంతో సులువుగా సెల్ ఫోన్లో ముఖాల గుర్తింపు రికార్డు అవుతున్నాయి. ఈచిన్న ఉపాయంతో ఉపాధి కూలీలకు హజరు నమోదవుతుంది. ముఖ గుర్తింపు కోసం ఈ ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాయం బాగుందని అందరూ అభినందిస్తున్నారు.

ఉపాధి హామీ పనుల్లో ఇకపై కూలీల హాజరును ఫేస్ అథెంటికేషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల్లో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎంఎంఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కమ్యూనిటీ పనులకు మార్చి 2 నుంచే ఫేస్ అథెంటికేషన్ అమల్లోకి రాగా, ఇకపై వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు కూడా వర్తింపజేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.