Reading Time: < 1 minute

అమెజాన్లో ఏఐ స్టోర్ ప్రారంభం

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్.ఇన్ తన ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ప్రత్యేకంగా ఒక స్టోర్ ప్రారంభించింది. ఏఐ పరికరాల కోసం వెతికే వారి  సంఖ్య ఏడాది కాలంలో 60 శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి.  ఏఐ పరికరాల కోసం వచ్చే సెర్చ్‌‌‌‌లలో 66 శాతం టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే ఉంటున్నాయి.

©️ VIL Media Pvt Ltd.