Reading Time: < 1 minute

ఈవీ ఛార్జింగ్ నెట్‌‌వర్క్కు ప్రణాళిక సిద్ధం చేయండి : సీఎస్ కె. రామకృష్ణా రావు

Caption of Image.
  •     పల్లెల్లోనూ ఛార్జింగ్ ​సెంటర్ల ఏర్పాటుకు చర్యలు: సీఎస్ కె. రామకృష్ణారావు
  •     అపార్ట్‌‌మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి: నవీన్ మిట్టల్ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎస్​ కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్​ఛార్జింగ్​సెంటర్ల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ మాట్లాడారు. ఈవీ వెహికల్స్​ వినియోగం పెరిగిందని, పల్లె, పట్టణాల్లోనూ ఛార్జింగ్​సెంటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్థలాలను గుర్తించాలన్నారు.  

ఛార్జింగ్​సెంటర్ల పర్యవేక్షణకు రియల్‌‌టైమ్ డ్యాష్‌‌బోర్డ్‌‌ ను డెవలప్ ​చేయాలని ఆదేశించారు. ఈవీ కేంద్రాల ఏర్పాటు, పారదర్శకత, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు డ్యాష్​బోర్డు ఉపయోగపడుతుందన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ అపార్ట్‌‌ మెంట్ భవనాల బేస్‌‌మెంట్‌‌లలో తప్పనిసరిగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. హోమ్ ఛార్జింగ్ అవకాశాలను కల్పిస్తే ఈవీ వినియోగం పెరుగుతుందన్నారు.  

©️ VIL Media Pvt Ltd.