Reading Time: < 1 minute

ఇండోనేసియాలో ఘోరం: హెలికాప్టర్ కూలి 8 మంది దుర్మరణం..

Caption of Image.

జకార్తా: ఇండోనేసియాలోని కాలిమంటన్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. స్థానిక రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ మహమ్మద్ షఫీ ప్రకారం.. గురువారం ఉదయం మెలావిలోని ఒక పామాయిల్ తోట నుంచి ఎయిర్‌‌‌‌బస్ హెచ్130 హెలికాప్టర్ బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కంట్రోల్ రూమ్‌‌‌‌తో దానికి సంబంధాలు తెగిపోయాయి. 

ఈ హెలికాప్టర్ ‘మ్యాథ్యూ ఎయిర్ నుసంతారా’ సంస్థకు చెందినదని అధికారులు తెలిపారు. సిగ్నల్ కట్ అయిన ప్రదేశానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శిథిలాలను రెస్క్యూ టీమ్స్ గుర్తించినట్లు చెప్పారు. దట్టమైన అడవులు, కొండలతో కూడిన ఏరియాలో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు.

©️ VIL Media Pvt Ltd.