Reading Time: < 1 minute

దేశంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ  : అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్

Caption of Image.
  • ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి
  •  రాష్ట్ర గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్ అడిషనల్ ​డీజీపీ అనిల్ కుమార్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: భారత్​లో హత్యల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయని.. వీటి నివారణకు అవగాహన కల్పించాల్సిన అవసరమముందని రాష్ట్ర గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్ అడిషనల్​డీజీపీ డా.అనిల్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఆదిలాబాద్​లోని రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులో ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరముందన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న ప్రమాదాలు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయన్నారు. అనంతరం రోడ్డుపై హెల్మెట్ ధరించి పిల్లలతో వెళ్తున్న ఇద్దరు వాహనదారులకు పిల్లల హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.మౌనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పి.శ్రీనివాస్, జీవన్ రెడ్డి, డాక్టర్లు, సీఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

©️ VIL Media Pvt Ltd.