
అమెరికాకు చెందిన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ క్యాండెసెంట్ హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది. ఇక్కడ 260 మంది పనిచేస్తారు. భారత్‌ను తమ ప్రధాన ఇంజినీరింగ్ కేంద్రంగా మార్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఈ సంస్థకు 800 మందికి పైగా ఇంజినీర్లు ఉన్నారు. అమెరికాలోని 1,300 బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లకు సేవలు అందించే క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫామ్ డెవలప్మెంట్లో భారత బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొత్త కేంద్రంలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, డేటా విభాగాల్లో సిబ్బంది సంఖ్యను పెంచనున్నట్లు సంస్థ సీఓఓ జాన్ గార్వే తెలిపారు. ఐఐటీ వంటి విద్యాసంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ద్వారా కొత్త వారిని తీసుకుంటామని చెప్పారు.