Reading Time: < 1 minute

ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యం :  ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

Caption of Image.

 దేవరకొండ(పీఏ పల్లి),  వెలుగు: దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్ ప్రాజెక్టులను, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. గురువారం పీఏ పల్లి మండలంలో ఏకేబీఆర్లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన పరిశీలించారు.

మెయిన్ డెలివరీ సిస్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 90.96 కోట్లతో చేపట్టిన ఈ లిఫ్ట్ ద్వారా దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 6,691 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.  అనంతరం దేవరకొండ మున్సిపాలిటీలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సభలో పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. అంతకుముందు గుడిపల్లి మండలం సింగరాజుపల్లిలో ‘అరైవ్.. అలైవ్’ లో భాగంగా వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.