Reading Time: < 1 minute

లోన్ ఇప్పిస్తానంటూ పానీపూరి వ్యాపారికి టోకరా.. ఫోన్ కొట్టేసి ఖాతా ఖాళీ చేసిండు

Caption of Image.

ఘట్​కేసర్, వెలుగు: లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ఓ కేటుగాడు.. పానీపూరి వ్యాపారి ఫోన్ ఎత్తుకెళ్లి, బ్యాంకు ఖాతాలోని నగదును కాజేశాడు. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నోజిగూడ వద్ద పానీపూరి వ్యాపారం చేసుకునే దేసెట్టి రాజు వద్దకు గతేడాది డిసెంబరులో ఓ వ్యక్తి వచ్చాడు. తాను పేటీఎం ఏజెంట్​నని పరిచయం చేసుకుని లోన్ చెక్ చేస్తానంటూ బాధితుడి మొబైల్ తీసుకున్నాడు. 

రాజు వ్యాపారంలో బిజీగా ఉండటంతో ఫోన్​తీసుకొని పరారర్యాడు. ఆపై యూపీఐ ద్వారా రాజు ఖాతా నుంచి రూ.54 వేలను తన అకౌంట్‌‌‌‌కు బదిలీ చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.