
హైదరాబాద్ సిటీ, వెలుగు: శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ వోబీ) అందుబాటులోకి రానుంది. రూ.71 కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఈ గ్రేడ్ సెపరేటర్‌ను శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, ఫలక్నుమా, – శివరాంపల్లి రైల్వే లైన్ పై ఈ బ్రిడ్జి నిర్మించారు.
మైలార్దేవ్పల్లి నుంచి ఫలక్నుమా ఆర్టీసీ బస్ డిపో వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ ఆర్ వోబీ ద్వారా ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రస్తుతం ఈ రూట్ లో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్య తొలగడమే కాకుండా, కనీసం 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానున్నది. 490 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో 4 లేన్లుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు.