
సరిహద్దు వెంబడి కొద్ది వారాలుగా తీవ్రమవుతున్న ఉద్రిక్తతల క్రమంలో ఇజ్రాయెల్ ,లెబనాన్ 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇది అరుదైన దౌత్యపరమైన పురోగతి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలతో మాట్లాడిన అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇరుపక్షాల మధ్య శాంతి ప్రక్రియలో ఇది మొదటి అడుగు..కాల్పుల విరమణ గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని ట్రంప్ ట్రూత్ సోషల్ రాశారు.
ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ఈ వారం ప్రారంభంలో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారని, 34 ఏళ్లలో ఇదే వారి మొదటి సమావేశమని ఆయన వెల్లడించారు . అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమక్షంలో ఈ చర్చలు జరిగాయి.నేను, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ,ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహులతో అద్భుతమైన సంభాషణలు జరిపాను అని ట్రంప్ అన్నారు. ఈ చర్చలు రెండు దేశాల మధ్య శాంతిని సాధించే దిశగా ఓ ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు.శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించడానికి ఇరు దేశాలతో కలిసి పనిచేయాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్యదర్శి రూబియో ,జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్‌లను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
►ALSO READ | తేజస్వీ ఖబడ్దార్.. తెలంగాణను అవమానిస్తే ఊరుకోం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మరో పోస్ట్‌లో 1983 తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య జరగనున్న మొట్టమొదటి అర్థవంతమైన చర్చల కోసం నెతన్యాహు, ఔన్‌లను వైట్ హౌస్‌కు ఆహ్వానించాలని తాను యోచిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. 1983 తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య జరగనున్న మొట్టమొదటి అర్థవంతమైన చర్చల కోసం నేను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌ను వైట్ హౌస్‌కు ఆహ్వానిస్తాను ..ఇరు పక్షాలు శాంతిని కోరుకుంటున్నాయి..అది త్వరలోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను!” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ రాశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడినట్లు లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇది తెరవెనుక కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. Xలో ఒక పోస్ట్‌లో, లెబనాన్ లో లో కాల్పుల విరమణకు, ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం కృషి చేసినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్.