
కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో చిచ్చు పోయడమే కాదు.. పగ ప్రతీకారాలతో పసి ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో జరిగిన ఒక అమానుష ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
పెద్ద కోడలి పిల్లలను బాగా చూసుకుంటూ, తన భర్తను.. తనను ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే కక్ష ఆ మహిళలో అమానుషాన్ని నింపింది. ఆ కోపం అమాయకపు నాలుగేళ్ల బాలుడిపైన చూపించింది. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి.. ఆ చిన్నారికి జ్యూస్ లో యాసిడ్ కలిపి తాగించింది ఆ కిరాతకరాలు.
►ALSO READ | హైదరాబాద్ లో రూ. 5 లక్షలకే 102 గజాల ప్లాటు .. రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం
యాసిడ్ తాగిన కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో, గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో స్పందించి అత్యవసర చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. కొంచెం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ ఘటనపై బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వల్ప కారణాలతో పసిపిల్లాడిపై జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.