
మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్. అయితే, వెండితెరపై తన నటనతో మ్యాజిక్ చేసే ఈ ముద్దుగుమ్మ, గత కొంతకాలంగా తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే లేటెస్ట్ గా తన సినిమా ‘డెకాయిట్’ (Dacoit) ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఈ రూమర్లపై మృణాల్ మరోసారి ఘాటుగా స్పందించారు
నా పని కంటే నా పెళ్లి గురించే చర్చ..
తన కష్టాన్ని పక్కన పెట్టి, జనం కేవలం తన డేటింగ్ లైఫ్ గురించే ఆసక్తి చూపిస్తున్నారని మృణాల్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను తెరపై చేసే నటనతో నన్ను గుర్తించాలని కోరుకుంటాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. ‘మృణాల్ ఎవరితో డేటింగ్ చేస్తోంది?’ అనే వార్తలే హెడ్‌లైన్స్‌లో ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే, నాకు డేటింగ్ చేయడానికి అసలు సమయమే లేదు. నా కాలికి లిగమెంట్ ఇంజూరీ అయ్యింది, దానికి ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.
రూమర్స్ ఎక్కడ మొదలయ్యాయి?
గత ఏడాది జరిగిన కొన్ని సంఘటనలు ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ సమయంలో ధనుష్‌ను మృణాల్ పలకరించిన వీడియో వైరల్ అవ్వడం. ధనుష్ నటిస్తున్న ‘తేరే ఇష్క్ మే’ రాప్-అప్ పార్టీలో మృణాల్ కనిపించడం. ఆమె నటించిన ‘దో దీవానే షెహర్ మే’ సినిమా విడుదల సమయంలో ఈ పెళ్లి వార్తలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి..
►ALSO READ | ‘అదే నిజమైతే మాకు పిల్లలు ఉండేవారు’.. చిరాగ్ పాశ్వాన్‌తో రోమాన్స్‌పై కంగనా రనౌత్ క్లారిటీ!
నా టీమే దానికి సాక్ష్యం!
ఈ వార్తలన్నీ సినిమా ప్రమోషన్ల కోసమే పుట్టించారనే వాదనను మృణాల్ కొట్టిపారేశారు. నా సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వార్తలు రావడం వల్ల నా పని నీడన పడిపోతుంది. ఇది నా టీమ్ చేస్తున్న పబ్లిసిటీ అని కొందరు అనుకుంటారు. కానీ, ఇలాంటి రూమర్ల నుండి నన్ను కాపాడుకోవడానికి నేను ప్రత్యేకంగా ఒక టీమ్‌ను నియమించుకోవాల్సి వచ్చింది అని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ప్రేమలో ఉంటే చెబుతా..
నేను చాలా ఓపెన్ పర్సన్‌ను. ఒక ఫ్రెండ్ చిన్న పూల మొక్క ఇచ్చినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని మృణాల్ చెప్పుకొచ్చారు.. నా జీవితంలో ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉంటే తప్పకుండా ప్రపంచానికి తెలియజేస్తాను. నిజంగా ప్రేమలో పడినప్పుడు నేనే చెబుతా అని మృణాల్ తన మనసులోని మాటను తెలిపారు. గతంలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌తో 18 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2022లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ ‘ధనుష్ – మృణాల్’ వెడ్డింగ్ రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి..
“I want to be known for the work that I do. I don’t want to be known for who is she dating.
Trust me I don’t have time to date. I have a ligament tear and after the X-ray, I haven’t had time to go treat my leg.”
– Actress #MrunalThakur | #DACOIT pic.twitter.com/oo5cVyxtOV
— Whynot Cinemas (@whynotcinemass_) April 15, 2026