Reading Time: < 1 minute

Toxic ట్రైలర్ రివ్యూ.. యష్ ‘టాక్సిక్’ తర్వాత ఏమైపోతాడో..!

Caption of Image.

కన్నడ స్టార్ యష్ (Yash) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకుడు. ఆగస్ట్ 26న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను శనివారం రాత్రి 7 గంటలకు చిత్ర బృందం విడుదల చేసింది. బెంగళూరు ఏఎంబీ మాల్లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హాలీవుడ్ టెక్నీషియన్స్, హాలీవుడ్ నటులు ఇందులో నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రేజ్కు తగ్గట్టు గానే.. ‘టాక్సిక్’ ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ట్రైలర్ కట్ ప్రాపర్గా అనిపించింది. యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. బలమైన భావోద్వేగం కూడా సినిమాలో ఉన్నట్లు స్పష్టమైంది.

యష్ తర్వాత కియారా అద్వానీ క్యారెక్టర్ ఈ సినిమాలో హైలైట్ అవుతుందని ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. యష్ డ్యుయల్ రోల్ చేస్తున్న మూవీ ఇది. టెక్నికల్ వ్యాల్యూస్, విజువల్స్ హాలీవుడ్ రేంజ్ను తలపించాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కన్నడతో పాటు పలు ఇండియన్ భాషలు, ఇంగ్లీష్లోనూ సినిమా విడుదల కానుంది. ఇంగ్లీష్ చిత్రీకరిస్తున్న మొట్టమొదటి కన్నడ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లో నిలిచింది. గ్లోబల్ ఆడియెన్స్ను దృష్టిలో పెట్టుకుని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో షూట్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.