Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివేంజ్’. గతేడాది చివర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే రీసెంట్‌గా ఈ సినిమా కథ కాపీ కొట్టారు అంటూ సంతోష్ కుమార్ అనే దర్శకుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు ఈ విషయంపై మాట్లాడ వద్దని సంతోష్‌కు సూచించింది.

తాజాగా ఈ ‘ధురంధర్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు సచ్‌దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట వైరల్ అయింది. అయితే ఈ పాటను త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్‌కి సంబంధిచి పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట ‘ఓయ్ ఓయ్‌’ని కూడా ధురంధర్ 2లో రీమిక్స్ చేయడం విశేషం. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్ దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. వెంటనే పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.