Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ ీగ్ 19వ సీజన్‌లోు =బుధవారం ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో ఢిల్లీ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ సింగిల్‌కు నిరాకరించడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మిల్లర్‌కు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు.

‘‘ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్‌కి స్ట్రైక్ ఇవ్వాల్సింది. అదే తెలివైన నిర్ణయం అని మ్యాచ్ తర్వాత మనకు అనిపిసుంది. కానీ, వాస్తవాలను ఆలోచిస్తే మిల్లర్‌ చివరి ఓవర్‌, అంతకుముందు ఓవర్లోనూ భారీ షాట్లు ఆడాడు. చివరి బంతిని కూడా అలా ఆడగలనని అతడు నమ్మకంగా ఉన్నాడు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. గుజరాత్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుత డెలివరీతో మిల్లర్‌కు షాట్‌ ఆడటం సాధ్యపడలేదు. దీంతో దిల్లీకి ఓటమి తప్పలేదు. అయితే, సింగిల్ తీయకుండా ఉన్నందుకు ఇక్కడ మిల్లర్‌ను నిందించాల్సిన అవసరం లేదు’’ గవాస్కర్‌ విశ్లేషించారు.