Reading Time: < 1 minute

వాషింగ్టన్: అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం మొదలవుతుందని, ఒప్పందం కుదరకపోతే ఈ సారి మరింత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. ఇరాన్ ఇప్పటికే బలహీనపడిందని..అవసరమైతే పూర్తిగా నాశనం చేస్తామని, గతంలో ఎవరూ చూడని విధంగా ఇరాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, హర్మూజ్ జలసంధిని తెరవాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.