Reading Time: < 1 minute

కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారు. ఉదయం 9 గంటలకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాంలో 17.87 శాతం, కేరళలో 16.23 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం రికార్డయింది. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు, నటులు మోహల్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి వంటి వారు ఓటు వేశారు.