
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. కాలనీలో అలముకున్నదట్టమైన పొగ, రహదారిపైకి డ్రమ్ములు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.