Reading Time: < 1 minute

అసోం, కేరళ, పుదేచ్చేరిలో పోలీంగ్ ప్రారంభం అయింది. కేరళలో 140 నియోజకవర్గాలకు 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు బరిలో 722 మంది అభ్యర్థులు నమోదయ్యారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు నమోదు అయ్యారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఓటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాటు చేశారు.