Reading Time: < 1 minute

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్‌టైనర్ ’ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటో లో హీరో తిరువీర్ తో పాటు టీమ్ మొత్తం ఒకేచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ వైబ్ లో కనిపించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.