Reading Time: < 1 minute

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ మీదున్న భారీ అంచనాల గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో పూర్తి సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్‌ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంది. అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాల్ని సృష్టించిన ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. మురళీ కిషోర్ అబ్బూరు ‘లెనిన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.