Reading Time: 2 minutes

దుబాయ్ : ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక తెరపడిందన్న సంబరం కొద్ది గంటలు కూడా నిలబడలేదు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే విషయమై అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటన ప్రపంచ దేశాలకు పోయిన హర్షం వ్యక్తం చేశాయి. అం తలోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై అత్యంత భీకర దాడులకు దిగింది. ఈ దాడిలో 89 మందికి పైగా మృతి చెందారు. 700 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలోలెబనాన్ ప్రముఖ మతపెద్ద అలీ నబూ డా 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడుల పట్ల భగ్గుమ న్న ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూ సి వే సింది. బీరూట్, ఇతర ప్రాంతాలలో ని ఇరాన్ ఆధిపత్య హెజ్‌బోల్లా మిలిటెంట్ల అ ణచివేత ల్లో భాగంగా ఇజ్రాయెల్ ఈ దాడుల కు దిగిం ది. ఈ మిలిటెంట్లపై తమ దాడులు ఆగబోవని ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదన తరువాత కూడా వెల్లడించింది. ఇందు కు అ నుగుణంగానే దాడులకు దిగింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఈ నెల 3 నుం చి జ రుగుతున్న పరిణామాలలో మొత్తం మృ తుల సంఖ్య 1500 దాటింది. లెబనాన్‌లో ఇ జ్రాయెల్ పలు చోట్ల భూతల దాడులు కూడా సా గిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ సాగిస్తో న్న దాడులలో 130 మంది వరకూ పిల్లలు చ నిపోయారు.

100 మందికి పైగా మహిళలు బలి అయ్యారు. అయితే హెజ్‌బోల్లా అంతం వరకూ తమ పంతం సాగుతుందని తాత్కాలి క కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ సేనలు కదం తొక్కుతున్నాయి. దీ నితో పోరు విరమణ ప్రక్రియపై నీలినీడలు ప ర్చుకున్నాయి. బుధవారం బీరూట్‌లో అ త్యం త భయానక పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో రక్తసిక్తమైన జనం కార్లలో దూర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆసుపత్రికి చేరేలోగానే పలువురు మృతి చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెబనాన్‌పై యుద్ధం ఆగబోదని, కాల్పుల విరమణ ప్రతిపాదన ఈ ప్రాంతం పరిధిలోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. బుధవారం తమ బలగాలు హెజ్‌బోల్లాకు మునుపెన్నడూ లేని స్థాయిలో నష్టం కల్గించాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెలీ కట్జ్ తెలిపారు.సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులు తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు దిగాయి. దీనితో పాటు కువైట్, బహరైన్‌లలో కూడా గగనతలంలో పోరు బీకరమైంది.

హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేసిన ఇరాన్

బుధవారం కొద్ది సేపు హర్మూజ్ జలసంధి మార్గం తెరిచేందుకు అంగీకరించిన ఇరాన్ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇజ్రాయెల్ నుంచి లెబనాన్‌పై భారీ స్థాయిలో దాడులతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దీనితో కాల్పుల విరమణ ప్రక్రియ ఆదిలోనే ఆటంకాలతో కుంటుపడింది. హర్మూజ్‌పై ఇరాన్ తాజా నిర్ణయం గురించి ఇరాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ తూట్లుపొడుస్తున్న దశలో తమ నిర్ణయాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా తన పెంపుడు పిచ్చికుక్కను అదుపులో పెట్టలేకపోతే , తాము అందుకు తగ్గట్లుగానే దెబ్బ తీయాల్సి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రక్రియలో లెబనాన్ కూడా ఉందని శాంతిచర్చలలో కీలకమైన పాకిస్థాన్ అంతకు ముందు తెలిపింది.