Reading Time: < 1 minute

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫోన్ కాల్ మాట్లాడారు. రేపు(ఏప్రిల్ 9) కెటిఆర్ జగిత్యాల పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసానికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో తనకు అవమానం జరిగిందని.. ఆ పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన బిఆర్ఎస్ లో  చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కెటిఆర్, జీవన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.