
ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ తమ దేశానికి ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవంటూ ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు. ఇరాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ట్రంప్ ప్రయోజనకరమైన పాలనాపరమైన మార్పుగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పని చేస్తామన్నారు. భూగర్భ అణు కేంద్రాలపై బి2 బాంబర్లతో చేసిన దాడుల వల్ల ఏర్పడిన అణువ్యర్థాలను టెహ్రాన్ సహాయంతో పూర్తిగా వెలికి తీసి తొలగిస్తామన్నారు.
దాడులు జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో దేనినీ కదిలించలేదని, అమెరికా స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాల ద్వారా నిరంతరం ఆ ప్రదేశంపై నిఘా ఉంచామని తెలిపారు. ఇరాన్‌లో ఇకపై ఎలాంటి యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగబోవని తేల్చి చెప్పారు. సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించే అంశంపై ప్రస్తుతం ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రతిపాదన లోని అనేక అంశాలపై ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.