Reading Time: < 1 minute

కాంగ్రెస్ ప్రముఖ నాయకురాలు , కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ బుధవారం కన్నుమూశారు. ఈ నాయకురాలి వయస్సు 94 సంవత్సరాలు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మంత్రివర్గాలలో కిద్వాయ్ కీలక మంత్రిత్వశాఖలు నిర్వర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకికి చెందిన కిద్వాయ్ ఇందిరా గాంధీకి కుడిభుజంగా వ్యవహరించారు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో చికిత్సకు చేరిన ఆమె నోయిడాలోని మెట్రో హాస్పిటల్‌లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు రజీ ఉర్ రెహ్మన్ కిద్వాయ్ తెలిపారు. అంత్యక్రియలు, సాయంత్రం నిజాముద్దిన్ ఖననవాటికలో జరిగాయి. అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులు అర్పించారు. ఖర్గే, రాహుల్ గాంధీ ఇతరులు సంతాపం తెలిపారు.