
టెహ్రాన్: ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. మిస్సైల్స్ తో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై 100 వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. లెబనాన్‌పై దాడి చేస్తూ.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొనసాగిస్తే, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుండి వైదొలుగుతామని ఇరాన్ హచ్చరించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్, యుద్ధ విరమణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ దేశాన్ని శిక్షిస్తామని ఇరాన్ పేర్కొంది.
“ఈ యుద్ధ విరమణ ఒప్పందం లెబనాన్ కూ వర్తిస్తుంది. ఇజ్రాయెల్ వాగ్దానాలను ఉల్లంఘించడంలో పేరుగడించింది. దానిని తూటాలతో మాత్రమే ఆపగలం” అని ఇరాన్ తెలిపింది.