Reading Time: < 1 minute

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. 2026 ఖరీఫ్ సీజన్‌కు ఎన్‌బిఎస్ సబ్సిడీ రేట్లకు ఆమోదం, జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. వెస్ట్‌బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ వెలువడింది.