Reading Time: < 1 minute

తెలంగాణలో జనగణన 2027కు ప్రభుత్వం సిద్ధమైంది. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సర్వే మే 11 నుంచి జూన్ 9 వరకు అదే విధంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం కల్పిస్తారు. ప్రజలు తమ వివరాలను ముందుగానే ఆన్‌లైన్ లో నమోదు చేసుకునే సౌకర్యం ఉంది. జనగణనలో పూర్తి సహకారం అందించాలని ప్రజలకు ప్రభుత్వ విజ్ఞప్తి చేసింది. సెన్సస్ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వడం తప్పనిసరి, తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా/శిక్షలు, సెన్సస్ అధికారులకు అడ్డంకులు కలిగిస్తే కఠిన చర్యలు ఉంటా యని పేర్కొంది. ఇళ్లలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని,- గుర్తులు/నంబర్లు వేయడానికి సహకారం అవసరం అని వెల్లడించింది. పాలసీ నిర్ణయా లు, అభివృద్ధి కోసం కీలకమైనది సెన్సస్ డేటాగా పేర్కొంది. సెన్సస్ సమాచారం గోప్యం,- కోర్టుల్లో కూడా ఉపయోగించరాదని వెల్లడించింది. అన్ని శాఖలు, కలెక్టర్లు, మున్సిపల్ సంస్థలకు ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.