
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు గుజరాత్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్‌కు ముఖేశ్ కుమార్ షాక్ ఇచ్చాడు. 3వ ఓవర్ తొలి బంతికే సాయి సుదర్శన్(12) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జాస్ బట్లర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్(29), సుందర్(15) ఉన్నారు.